26.8 C
Hyderabad
Monday, March 1, 2021

ఎంఐఎం ఎంపీపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై స్పెషల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తనపై దాడి చేశారంటూ మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ ఈ కేసు వేశారు. గ్రేటర్ హైదరాబాద్ కు 2016 లో జరిగిన ఎన్నికల సమయంలో మీర్ చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో షబ్బీర్ అలీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఎంఐఎం కార్యకర్తలు షబ్బీర్ ని అడ్డగించడంతోపాటు ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు అయింది. స్పెషల్ కోర్టులో ఐదేళ్లుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది.

- Advertisement -

Latest news

Related news