కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఆయుష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గవర్నమెంట్, ప్రైవేట్ ఆయుష్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్ వైసీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. నీట్-2020లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి 20 వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.In ను సందర్శించండి.