26.6 C
Hyderabad
Sunday, January 24, 2021

బడ్జెట్‌లో మూడోవంతు రైతులకే..: మంత్రి హరీశ్‌ రావు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో మూడో వంతు రైతులకే ఖర్చు చేస్తున్నదని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. గత ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం కామారంలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మెదక్‌ జిల్లాలో రూ.94 కోట్లతో 1888 మంది రైతులకు బీమా సాయం అందించామని చెప్పారు. యాసంగిపంట సాయం కోసం జిల్లాకు రూ.190 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంట సాయంగా రూ.7,200 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. అతిత్వరలో కాళేశ్వరం ద్వారా మెదక్‌ జిల్లాకు నీరందిస్తామని వెల్లడించారు. వచ్చే ఆర్థికసంవత్సరం సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు డబ్బు ఇస్తామని ప్రకటించారు. అంతకుముందు చిన్నశంకరంపేటలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...