బోయిన్పల్లి కిడ్నాప్ కేసు విచారణలో మరికొందరి పేర్లు బయటకు వచ్చాయని నిన్న సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశామన్నారు. కిడ్నాప్ చేసేందుకు విజయవాడ నుంచి 20 మంది తెచ్చేందుకు గుంటూరు శ్రీను.. సిద్ధార్థకు రూ. 5 లక్షలు ఇచ్చినట్లు సీపీ చెప్పారు. గుంటూర్ శ్రీను, అఖిలప్రియ కలిసి ఈ నెల 2న భార్గవరామ్ ఇంట్లో, 4న ఎంజీహెచ్ స్కూళ్లో మరోసారి కిడ్నాప్‌కు వ్యూహం రచించారన్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్ సోదరుడు చంద్రహాస్తోపాటు మాదాల శ్రీను, భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని సీపీ వెల్లడించారు. అఖిల ప్రియ డ్రైవర్ బాల చెన్నయ్య, పర్సనల్ సెక్రెటరీ మల్లికార్జున్ రెడ్డి, సంపత్ లను కస్టడీలోకి ఇవ్వాలని సికింద్రాబాద్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్ పై రేపు కోర్టు తీర్పు ఇవ్వనుంది.