హైదరాబాద్ కూకట్పల్లిలో భూప్రకంపనలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. స్థానిక అస్బెస్టాస్ కాలనీలో ఈరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో భూమి కంపించిది. రెండు, మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు, ఈ సమయంలో భూమిలోపల నుంచి భారీ శబ్ధాలు వచ్చినట్టు స్థానికులు చెప్పారు. గతంలో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసినప్పుడు బోరబండ ఏరియాలో భూ ప్రకంపనలు కొన్ని రోజుల పాటు అక్కడి ప్రజలకు కంటిపై కునుకులేకుండా చేసిన విషయం తెలిసిందే.