18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

వచ్చే నెలలో పోలీసు ఉద్యోగాల భర్తీ యాప్‌ ద్వారా నియామకం

రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పలు శాఖల్లో ఉద్యోగ నియామక ప్రక్రియలో అధికారలు వేగం పెంచారు. పోలీసుశాఖలో పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే నెలలో నియామకానికి సంబంధించి ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి నియామక ప్రక్రియ సులభంగా ఉండేందుకు గానూ.. ప్రత్యేక యాప్‌ రూపొందించి యాప్ ద్వారా నియామకాలు జరపాలని పోలీసు నియామక మండలి అధికారులు యోచిస్తున్నారు. దీని ద్వారా దరఖాస్తు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసుశాఖలో ప్రస్తుతం 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పోస్టుల భర్తీని పోలీసు నియామక మండలి చేపడుతుంది. 2018 మేలో నియామక మండలి దాదాపు 16 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన భర్తీ కంటే కూడా ఇది ఎక్కువే. అయితే.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఒకేసారి 20వేల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు గానూ.. అధునాతన టెక్నాలజీని వాడనున్నారు.

పోలీసు నియామక ప్రక్రియ మిగతా ఉద్యోగాల భర్తీ కంటే భిన్నంగా ఉంటుంది. రాత పరీక్షలతో పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలి. అన్నింటిలోనూ ఉత్తీర్ణులై ఎంపికైన వారికి సంవత్సరంపాటు శిక్షణ ఉంటుంది. ఇందుకు సమయం కాస్త ఎక్కువే పడుతుందది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగానియామక ప్రకటన జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెలాఖరుకల్లా ప్రకటన విడుదల చేస్తే.. నియామకాలు పూర్తిచేయడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. తర్వాత సంవత్సర కాలం శిక్షణ కొనసాగుతుంది. ఈ లెక్కన 2021 జనవరిలో ప్రకటన విడుదలైతే అర్హత పొందిన వారు 2022 ఏప్రిల్‌ తర్వాతే ఉద్యోగాల్లో చేరుతారు. ఈ అంశాల దృష్ట్యా ప్రభుత్వం ఆమోదం తెలపగానే పోలీసు అధికారులు నియామక ప్రక్రియ ప్రారంభించారు. జనవరి నెలాఖరుకల్లా ఉద్యోగ ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది.

నియామకాలకు ప్రత్యేక యాప్‌

గత రెండు నియామకాల నుంచి పోలీసు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశాక.. తమ పేరు తప్పుగా నమోదయిందని, కులం పేర్కొనలేదని చెబుతూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి.ఈ సమస్యలను నివారించేందుకు ఈసారి నియామకాల కోసం అధికారులు ప్రత్యేకంగా యాప్‌ రూపొందించే ఆలోచనలో ఉన్నారు. అభ్యర్థులంతా ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని దాని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు దొర్లినా వెంటనే సరిదిద్దుకోవచ్చు. నియామకాలపై మండలి తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా అభ్యర్థులకు చేరవేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణ, అనుమానాల నివృత్తి చేయవచ్చు. టెక్నాలజీ సాయంతో ప్రత్యేక యాప్‌ అభివృద్ధి చేసి దాని ద్వారా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...