ఆకట్టుకునే యాంకరింగ్.. టైమింగ్ పంచ్ లతో బుల్లితెర యాంకర్లలో బెస్ట్ అనిపించుకుంటున్న ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అనే పాట సూపర్ హిట్టై సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో ప్రదీప్‌కు జోడీగా అమృతా అయ్యార్ నటించింది. ప్రదీప్ హీరోగా వస్తున్న తొలి సినిమాను గతేడాదే విడుదల చేయాలనుకున్న కరోనా ప్రభావంతో వాయిదా పడింది.

గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జనవరి 29న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.