29.3 C
Hyderabad
Monday, March 1, 2021

భార్యపై పగతో 17 మందిని చంపిన సైకో రాములు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కు చెందిన వెంకటమ్మ అనే మహిళను కిరాతకంగా హత్య చేసిన కేసులో సైకో కిల్లర్‌ రాములును అరెస్టు చేసినట్లు సీపీ అంజనీకుమార్‌ చెప్పారు. సైకో కిల్లర్‌ పై రాములుపై 17 హత్యకేసులు, 5 దోపిడీ కేసులు నమోదు అయ్యాయన్నారు. నిందితుడిపై మెదక్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పలు కేసులు నమోదైనట్లు సీపీ చెప్పాడు.

20 రోజుల పాటు సాగిన దర్యాప్తులో అనేక విషయాలను పోలీసులు రాబట్టారు. 2002లో 21 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు రాములుకు పెళ్ళి జరిగింది. కొన్నాళ్లకే మరో వ్యక్తితో తన భార్య లేచిపోయింది. దాంతో ఆడవాళ్లపై రాములు పగ పెంచుకున్నాడు. 2003లో తుఫ్రాన్ పీఎస్ లిమిట్స్ లో రాములు మొదటి హత్య చేశాడు. ఒంటరి మహిళలను లక్ష్యం చేసుకోని వారిని నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్ళి హత్యలు చేసేవాడు.

2009లో జరిగిన ఓ మహిళా హత్య కేసులో రాములుకు జీవిత ఖైదు పడింది. అయితే అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రికి తరలించారు.  అక్కడి నుండి  2011లో రాములు తప్పించుకున్నాడు. ఆ తర్వాత 5 దోపిడీలకు పాల్పడ్డాడు. 2013లో బోయినపల్లి పోలీసులు రాములును మరోసారి అరెస్టు చేసి కేసులు పెట్టారు. 2018లో బెయిల్ పై రాములు జైలు నుండి విడుదలయ్యాడు. ఆ తర్వాత కూడా రెండు హత్యలకు పాల్పడ్డాడు.

- Advertisement -

Latest news

Related news