29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ ల్యాబ్ పెట్టండి.. కేటీఆర్

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కి కేటీఆర్ లేఖ

ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా జీనోమ్ వ్యాలీ

ఇక్కడి కంపెనీలు 60 బిలియన్ డోసులు తయారు చేస్తున్నయ్

ప్రధానితో సహా 85 దేశాల రాయబారులు పర్యటించారు

భారతదేశ వ్యాక్సిన్ తయారీ రంగాన్ని బలోపేతం చేయాలి

హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్  టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబరేటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి  కే. తారకరామారావు(కేటీఆర్) కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కుటుంబ సంక్షేమ వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్ కి కేటీఆర్ లేఖ రాశారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని, ఏటా ఇక్కడి నుంచి 60 బిలియన్ల డోసుల వ్యాక్సిన్లను ఇక్కడి బయో టెక్ కంపెనీలు తయారు చేస్తున్నాయన్నారు.

ప్రపంచం వ్యాప్తంగా తయారయ్యే వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడి జీనోమ్ వ్యాలీలోనే తయారువుతున్నట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ఇంత ప్రాధాన్యత ఉందిగనుకే ప్రధాని నరేంద్ర మోడీతో 80 దేశాలకు చెందిన రాయబారులు వచ్చి జీనోమ్ వ్యాలీని సందర్శించి కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ వివరాలు అడిగి తెలుసుకున్నారని లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.

టెస్టింగ్, సర్టిఫికేషన్ ట్యాబ్ ఏర్పాటు కోసం గతంలో ఒకసారి కేంద్రాన్ని కోరినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి సెంట్రల్ డ్రగ్ లేబరేటరీ హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలి లో ఉందని, ప్రతి సారి అక్కడికి తమ వ్యాక్సిన్లను పంపి పరీక్షించడం, సర్టిఫికేషన్ పొందడంలో హైదరాబాద్ బయోటెక్ కంపెనీలు అధిక సమయాన్ని కోల్పోవాల్సి వస్తున్నట్లు దృష్టికి తీసుకువచ్చారు. 

దేశంలోనే అతిపెద్ద నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు కావాల్సిన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా  అందించిదని మంత్రి కేంద్రానికి గుర్తుచేశారు.

ప్రస్తుతం కోల్ కతా, ముంబై, చెన్నై, కర్నాల్ లలో మాత్రమే ఉన్న గవర్నమెంట్ మెడికల్ స్టోర్ డిపోను ఇక్కడా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ రెండు విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా తీసుకొని వెంటనే నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.

- Advertisement -

Latest news

Related news