24.2 C
Hyderabad
Friday, January 22, 2021

రైతుబంధు పంపిణీ సర్వం సిద్ధం.. లబ్ధి పొందనున్న 59.62 లక్షల మంది రైతులు

యాసంగి సీజన్‌ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్ల నిధులు జమ చేయడానికి సిద్ధమైంది. ఈ యాసంగిలో దాదాపు 59.32 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయాన్ని అందుకోనున్నారు. గతేడాది 57.62 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయగా.. ఈ సీజన్‌లో 1.70 లక్షల మంది అదనంగా లబ్ధిపొందనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో కొత్తగా పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు ఈసారి రైతుబంధు లబ్ధిదారుల జాబితాలో చేరారు.

యాసంగి పెట్టుబడిసాయం పంపిణీని ఈ నెల 28 నుంచి మొదలు పెట్టి, పదిరోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. బ్యాంకుల నుంచి రైతులు నగదు డ్రా చేసే సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు.

- Advertisement -

Latest news

Related news

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.