23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

హైదరాబాద్‌లో రోప్ వే.. ఎక్కడెక్కడంటే..

మెట్రో వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ట్రాన్స్‌పోర్ట్ కష్టాలు సగం తీరిపోయాయి. అలాంటిది ఇప్పుడు మరో కొత్తరకం ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ప్రపంచంలో చాలా దేశాల్లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న రోప్ వే ట్రాన్స్‌పోర్ట్ మార్గాన్ని హైదరాబాద్‌లో స్టార్ట్ చేయాలని యూనిఫైడ్ మెట్రో పాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్లాన్ చేస్తుంది. రోప్ వే అంటే రెండు ప్రదేశాలను గాలిలో రోప్ ద్వారా కనెక్ట్ చేస్తారు. ఆ రోప్‌కు హ్యాంగ్ అయ్యి క్యాబిన్స్ కదులుతుంటాయి. మన హైదరాబాద్‌లో రెండు లేదా మూడు కారిడార్‌లలో ఈ రోప్ వేను ప్లాన్ చేయాలని చూస్తున్నారు. ఆయా కారిడార్స్‌లో ఉండే పాజిబిలిటీస్, ప్రాబ్లమ్స్‌ను స్టడీ చేస్తున్నారు.

ఎంజీబీఎస్‌ నుంచి నెహ్రూ జూ , ఖైరతాబాద్‌ నుంచి సచివాలయం, ప్యారడైజ్‌ నుంచి సచివాలయం వెళ్లే దారిలో రోప్ వే ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే పర్యాటకులు ఎక్కువగా వెళ్లే యాదాద్రి జిల్లాలోని రాయగిరి నుంచి యాదాద్రి గుడి వరకు రోప్‌ వే సాధ్యమవుతుందా అని స్టడీ చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news