గంగపుత్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, వారి రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండీ ఎస్సారెస్పీ గెస్ట్ హౌజ్ లో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కుల వృత్తులకు రూ.1000 కోట్లతో తోడ్పాటు అందించేందుకు ప్రణాళిక ఉందన్నారు. గంగపుత్ర భవన్‌కు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, గంగపుత్రులు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. వెనుక బడిన కులాలందరికి త్వరలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు.
కాళేశ్వరం జలాలతో తెలంగాణ పచ్చగా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శించడం సిగ్గుచేటు మండిపడ్డారు. తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అని మరోమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎంగా కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. మా అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అన్ని విధాల స్వాగతిస్తామని పేర్కొన్నారు. మినిస్టర్‌గా కేటీఆర్ తెలంగాణకు అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు తెచ్చి తన ప్రతిభను నిరూపించుకున్నారని మంత్రి గుర్తుచేశారు.