నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే కొత్త పీసీసీ చీఫ్ ఎన్నికల ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. సాగర్ ఉప ఎన్నిక తమకు ముఖ్యమైందన్నారు. పీసీసీ ఎన్నికపై ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యనేతలతోపాటు జిల్లా కాంగ్రెస్ బాధ్యుల నుంచి ఠాగూర్ అభిప్రాయాలను సేకరించారు. నేతల అభిప్రాయాలను ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అందజేసినట్లు పేర్కొన్నారు. కొత్త పీసీసీ ఎన్నిక జరిగే వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డే పీసీసీ బాధ్యతలు చేపడుతారన్నారు. పీసీసీ రేసులో రేవంత్ రెడ్డితోపాటు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్నారు.