23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

రేపటి నుంచే స్కూళ్లు, కాలేజీలు.. ఈ రూల్స్ తప్పనిసరి

దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత రేపు స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌తోపాటు వృత్తివిద్యా కళాశాలలన్నీ తెరుచుకోబోతున్నాయి.


రేపు మొత్తంగా సుమారు 30 లక్షల స్టూడెంట్స్ హాజరయ్యే అవకాశాలున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు 70శాతానికి పైగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాలు సమర్పించినట్టు అధికారులు చెప్తున్నారు. ఇంటర్‌ కాలేజీల్లో ఒకరోజు ఫస్టియర్‌, రెండో రోజు సెకండియర్‌ తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులు సమ్మతిపత్రం సమర్పించడం తప్పనిసరి. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్యాకాలేజీల్లో రోజుకు 50శాతం మంది విద్యార్థులను అనుమతించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి విద్యార్థి నుంచి స్వీయ సమ్మతిపత్రం తప్పనిసరి.


స్కూళ్లు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటాయి. హైదరాబాద్‌ జిల్లాలో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉండొచ్చు. అలాగే కాలేజీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉంటాయి.

- Advertisement -

Latest news

Related news