29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సీరియల్ నటి హర్షిత వెంకటేష్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు ప్రీతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి బుల్లితెర నటి హర్షిత వెంకటేష్ ఈరోజు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. స్థలం లేని పక్షంలో టెర్రస్ గార్డెన్స్, హౌస్ గార్డెన్స్ లలో మొక్కలు నాటాలన్నారు. ఏదో ఒక రకంగా అందరూ మొక్కలు పెంచడం ఒక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. మనీష్, రష్మీ, మైతిలిలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని సవాల్ విసిరింది.

- Advertisement -

Latest news

Related news