కరోనా కాలంలో ఎందరికో సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ మన శవాల శివ అంబులెన్స్ సర్వీస్ ని ప్రారంభించాడు. శివ చేస్తున్న సేవలను సోనూసూద్ ప్రశంసించారు. భవిష్యత్తులో ఏమి కావాలన్న తాను ఉన్నానని శివకు భరోసా ఇచ్చాడు. ఇక ఈ అంబులెన్స్ సేవలను విస్తృతం చేస్తామని సోనూనూద్ చెప్పాడు.
ట్యాంక్‌బండ్ లో ఆత్మహత్య చేసుకున్న వారి శవాలను, ప్రయత్నించే వారిని కాపాడే మన శవాల శివ గురించి అందరికీ తెలిసిందే. ట్యాంక్ బండ్ లో నుంచి తీసిన శవాలను తరలించేందుకు దాతలు ఇచ్చిన విరాళాలతో ఓ కారుని కొని అంబులెన్స్ సర్వీస్ ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. దీనికి రియల్ హీరో పేరు పెట్టడంతోపాటు సోనూసూద్ ని వచ్చి ప్రారంభించాలని సోనూని కోరాడు. అతని కోరిక మేరకు మంగళవారం ట్యాంక్‌బండ్‌కు వెళ్లిన సోనూసూద్.. శవాల శివ ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశాడు.