21.5 C
Hyderabad
Wednesday, January 20, 2021

త్వరలో బుల్లితెరపై శ్రీముఖి కొత్త షో

బుల్లితెరపై కొత్త కొత్త షోలు వస్తుంటాయి.. కొన్నిరోజులకు మాయమై పోతుంటాయి. ఫామ్ లో ఉన్నవారికి కొత్త ఆఫర్లు వస్తుంటాయి. అలా ఒక షో నుంచి ఇంకో షోకు మారుతూ ఉంటారు. జబర్దస్త్ కామెడీ షో కు పోటీగా అదిరింది షో తీసుకొచ్చింది జీ తెలుగు. కొంతకాలం తర్వాత శ్రీముఖితో అదే షో రీఫ్రెష్ చేస్తూ.. బొమ్మ అదిరింది అని మార్చారు. అయితే ఇప్పుడు బొమ్మ అదిరింది పరిస్థితి దారుణంగా అయింది. చెప్పా పెట్టకుండా దుకాణం సర్దేశారు. మార్పులు చేర్పులతో.. జబర్దస్త్ షోకు పోటిగా తీసుకొచ్చిన అదిరింది షో అంతగా క్లిక్ కాలేదు. అలా ఓ మోస్తరుగా నడుస్తున్న అదిరిందికి రిపేర్లు చేసి యాంకర్లు, జడ్జ్‌ని మార్చేశారు. శ్రీముఖి, జానీ మాస్టర్‌లు వచ్చిన తర్వాత బొమ్మ అదిరింది షో కొంచెం పైకి లేచింది.
సద్దాం, రియాజ్ స్కిట్లతో షోకి కాస్త బూస్టప్ వచ్చింది. ఇమిటేషన్‌తో చేసే స్కిట్లు బాగానే వర్కవుట్ అయ్యాయి.. ప్రతీ వారం స్పెషల్ గెస్ట్‌లను తీసుకొచ్చి బాగానే నడిపించారు. అంతా బాగానే నడుస్తుందన్న సమయంలో మొత్తానికి షో అడ్రస్సే గల్లంతయింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బొమ్మ అదిరింది షోను ఎత్తేశారు. షో లో జడ్జ్‌గా ఉన్న జానీ మాస్టర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగబాబు తన యూట్యూబ్ పనిలో మునిగిపోయాడు. మిగిలింది శ్రీముఖి. బొమ్మ అదిరింది షో బిచాన సర్దేయడంతో ఒక్క శ్రీముఖి ఖాళీ అయిపోయింది. శ్రీముఖి ఎక్కువ జీ తెలుగు షోలనే చేస్తూ.. ఈటీవీ ఈవెంట్లకు దూరమైంది. అయితే.. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ పేరుతో తాజాగా ఈటీవీలో కొత్తగా ప్రారంభం కాబోతోన్న షోతో శ్రీముఖి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ క్రమంలో ఈ కొత్త షోలో సీరియల్ హీరో అంబటి అర్జున్ కూడా ఉన్నాడు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన ప్రోమో వీడియో వైరల్ అవుతోంది.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...