29.3 C
Hyderabad
Monday, March 1, 2021

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్

తెలంగాణ జాగృతి తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ 2021 వాలీబాల్ టోర్నమెంట్ నేడు ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లు రాష్ట్రవ్యాప్తంగా 880 టీంలు పాల్గొంటాయి. జిల్లాల్లో గెలిచిన ప్రథమ జట్టుకు కప్పుతో పాటు రూ.20వేల నగదు ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు కప్పుతో పాటు రూ.10 వేల నగదు అందించనున్నారు. జిల్లా స్థాయిలో గెలిచిన ప్రథమ జట్టు హైదరాబాద్ లో జరిగే ఫైనల్ లీగ్ మ్యాచుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన జట్టుకు కేసీఆర్ కప్ 2021 ట్రోఫీతో పాటు రూ.లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తారు. రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ.75,000 నగదు బహుమతి ఉంటుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్రీడోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు.


నిర్మల్ జిల్లాలో ఈరోజు ప్రారంభమైన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మహబూబ్ నగర్ లో ప్రారంభమైన టోర్నమెంటును యువజన క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వాలీబాల్ ఆడి ప్రారంభించారు. కామారెడ్డి లో జరిగిన క్రీడలను కలెక్టర్ శరత్ ప్రారంభించారు. అలాగే వివిధ జిల్లాల్లో ప్రారంభమైన వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, మెతుకు ఆనంద్, కృష్ణ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఆదిలాబాద్ మేయర్ జోగు ప్రేమేందర్, నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్, మంచిర్యాల చైర్మన్ పెంట రాజయ్య, గద్వాల చైర్మెన్ బి.ఎస్ కేశవ్ తదితరులు ప్రారంభించారు.

- Advertisement -

Latest news

Related news