మెల్లమెల్లగా చలి తగ్గుతోంది. ఎండలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈ సారి సమ్మర్ లో ఎండలు బాగానే ఉంటాయని చెప్తున్నారు వాతావరణ అధికారులు. పోయిన సారి లాక్ డౌన్ వల్ల హాయిగా ఇంట్లోనే ఉండిపోయాం. మరి ఈ సారి ఎండాకాలం ఎలా ఉండబోతుంది?

ఈసారి ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఫిబ్రవరిలో ఒకటి అడపాదడపా ఎండలు ఉన్నఅ.. మార్చి 1 నుంచి మాత్రం ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. హైదరాబాద్లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, గోదావరిఖని ప్రాంతల్లో కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
పోయిన సారి లాక్ డౌన్ వల్ల ఎండ తీవ్రత తెలియలేదు. పైగా కాస్త తక్కువగానే ఉందని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ సారి గత ఏడాది కంటే ఎక్కువ ఎండలు ఉంటాయని, వడదెబ్బలు లాంటివి తగలకుండా జనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తంగా మరో నెలలో సమ్మర్ హీట్ మొదలవ్వబోతోంది. జాగ్రత్తగా ఉండాలి మరి!