21.7 C
Hyderabad
Friday, January 22, 2021

రాష్ర్ట తొలి మ‌హిళా క‌మిష‌న్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి

రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి శుక్ర‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్‌, గ‌ద్ద‌ల ప‌ద్మ‌, కుమ్ర ఈశ్వ‌రీబాయి, సూదం ల‌క్ష్మి, ఉమాదేవి యాద‌వ్‌, రేవ‌తీరావు బాధ‌త్య‌లు స్వీక‌రించారు. బుద్ధ‌భ‌వ‌న్ క‌మిష‌న్ కార్యాల‌యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం చైర్‌ప‌ర్స‌న్ సునీతా ల‌క్ష్మారెడ్డితో పాటు మిగ‌తా స‌భ్యుల‌కు మంత్రి కేటీఆర్ పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులు 5 ఏండ్ల పాటు పదవిలో కొనసాగ‌నున్నారు.

సునీతా నేపథ్యం..

1999లో నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరుసగా మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా  విజయం సాధించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...