29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

జవాన్ మోతీలాల్ కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్సీ కవిత

రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన జవాన్ మోతీలాల్ మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. దేశ రక్షణకై సైన్యంలో చేరిన మోతీలాల్, స్వగ్రామంలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు.  మోతీలాల్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు.

నిజమాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం మేగ్యా నాయక్ తండాకు చెందిన ఆర్మీ జవాన్ దెగవత్ మోతీలాల్ (25) డిసెంబర్ 28న సదాశివనగర్ మండలం దగ్గి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్‌కు తరలించగా… చికిత్స పొందుతూ  ఈరోజు ఉదయం మృతి చెందారు.

- Advertisement -

Latest news

Related news