సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామానికి చెందిన చంద్రమౌళి అనే రైతు మిర్చి పంటను కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచన చేశాడు. ఇప్పుడాతడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండెకరాల్లో సాగు చేసిన మిర్చి పంట చేతికొచ్చే సరికి ఏదో ఒక తెగులుతో పాడవుతోంది. త రెండు, మూడు సంవత్సరాల నుంచి ఇలాగే జరగడంతో తన చేనుకు నరదిష్టి తగులుతుందని చంద్రమౌళి భావించాడు. దీంతో పంటపై మనషుల చూపు పడకుండా దిష్టిబొమ్మలకు బదులుగా.. రొమాంటిక్గా ఉన్న తమన్నా, కాజల్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఈ సారి పంట బాగా పండి మంచి గిట్టుబాటు వచ్చేలా ఉందని, ఎలాంటి తెగులు సోకలేదని రైతు చంద్రమౌళి ఆనందంగా చెబుతున్నాడు.