వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి తెలిపింది. అయితే కొత్తగా వేసిన లే అవుట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని పేర్కొంది.
కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అప్రూవల్ పొందిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలిగాయి.