పదో తరగతి పరీక్షల విధానంలో పలు మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 11 పరీక్షలకు బదులుగా 6 పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సవరించిన మార్పులను వెల్లడిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్ సబ్జెక్టులకు ఒకే పరీక్ష ఉండేలా మార్పులు చేసింది. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్లు ఇవ్వాలని ఎస్ఎస్సీ బోర్డును విద్యాశాఖ ఆదేశించింది.
పరీక్ష రాసే సమయాన్ని సైతం 2.45 గంటల నుంచి 3.15 గంటలకు పొడిగించారు. ఎప్పటిలాగే ఎఫ్ఏ పరీక్షలకు 20, బోర్డు పరీక్షలకు 80 మార్కులు ఉంటాయని.. అందులో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ నూతన విధానం 2020-21 విద్యా సంవత్సరానికి మాత్రమేనని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.