26 C
Hyderabad
Wednesday, January 27, 2021

ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు 8వేలు.. త్వరలో భర్తీ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియలో ప్రాథమిక అంకం దాదాపు పూర్తయింది. వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలు, కొన్నింటిలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు జిల్లాలవారీగా ప్రభుత్వానికి అందాయి. ఆయా శాఖల అధికారులు ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా పనిచేసి పూర్తి వివరాలను సోమవారం ప్రభుత్వానికి అందించారు.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖలో టీచర్‌ పోస్టుల ఖాళీలు 8,000 ఉన్నాయని పేర్కొంటూ ఆ శాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, భాషా పండితులు, పీఈటీలతోపాటు మోడల్‌ స్కూల్‌లో ఖాళీగా ఉన్న టీజీటీ, పీజీటీ పోస్టుల వివరాలు కూడా ఉన్నాయి. డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ అధికారులు, డైట్‌ కాలేజీ లెక్చరర్లు, గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్ల పోస్టుల వివరాలను కూడా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపాయట. రిజర్వేషన్ల వారీగా, రోస్టర్‌ పాయింట్లతో సహా ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. నివేదికను సీఎం కేసీఆర్ పరిశీలించిన తరువాత ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. భారీ స్థాయిలో వైద్య, విద్య, పోలీస్‌ శాఖల్లో నియామకాలు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వీటితో పాటుమిగిలిన శాఖల్లో ఉన్న ఖాళీలను కూడా వాటి అవసరాల మేరకు నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.

- Advertisement -

Latest news

Related news

త్రివర్ణ హైదరాబాద్

72వ గణతంత్ర దినోత్సం వేళ హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక భవనాలు త్రివర్ణ లైటింగ్ తో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. వీటి వెలుగులను ఒకే ఫ్రెమ్ లో బంధించేందుకు డ్రోన్ కెమెరాలతో...

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది....

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...