29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ డేట్ ఫిక్స్

తెలంగాణ‌లో టెన్త్ ఎగ్జామ్స్ మే 17 నుంచి 26 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ స్పెష‌ల్ చీఫ్‌ సెక్ర‌ట‌రీ చిత్రా రాంచంద్ర‌న్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. టెన్త్ ఎగ్జామ్స్ ముగిసిన మ‌రుస‌టి రోజు(మే 26) నుంచి జూన్ 13 వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించారు. గ‌తంలో ఆరు స‌బ్జెక్టుల‌కు 11 పేపర్లు ఉండగా.. ఈసారి ఆరు పేపర్లతోనే ఎగ్జామ్స్ పెట్టనున్నారు. నాలుగు ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌ (ఎఫ్ఏ) టెస్టుల‌కు గానూ రెండు ఎఫ్ఏ టెస్టుల‌ను మాత్ర‌మే నిర్వహించనున్నారు. మొద‌టి ఎఫ్ఏను మార్చి 15న‌, రెండో ఎఫ్ఏ ఏప్రిల్ 15న పెట్టనున్నారు. స‌మ్మేటివ్ అసెస్‌మెంట్‌(ఎస్ఏ)ను మే 7 – 13 మ‌ధ్య‌లో నిర్వహించనున్నట్లు ఉత్త‌ర్వుల్లో చెప్పారు.

ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి 9, 10వ త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. అయితే, వీరికి స‌రిప‌డా హాజ‌రు శాతం లేన‌ప్ప‌టికీ విద్యార్థుల‌ను ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు అనుమతిస్తారు. హైద‌రాబాద్ లో ఉద‌యం 8:45 నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు క్లాసులు నిర్వహిస్తారు. అదే జిల్లాల్లో ఉద‌యం 9:30 నుంచి సాయంత్రం 4:45 వ‌ర‌కు క్లాసులు ఉంటాయి. ఆన్‌లైన్ క్లాసులైతే ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఉద‌యం 10 నుంచి 11, 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు సాయంత్రం 4 నుంచి 5 మ‌ధ్య నిర్వహిస్తారు.

- Advertisement -

Latest news

Related news