ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో మన తెలంగాణకు చెందిన కీర్తి కూడా స్థానం సంపాదించింది.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కొత్త కీర్తిరెడ్డి ‘ఫోర్బ్స్ ఇండియా అండర్-30’ జాబితాలో స్థానం సంపాదించింది. 24 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన కీర్తిరెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూతురు.
ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిన 13 మంది మహిళల్లో కీర్తిరెడ్డి ఒకరు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ నుంచి గ్లోబల్ మాస్టర్స్ పట్టా పొందిన కీర్తి రెడ్డి చిన్ననాటి నుంచే వినూత్నంగా ఆలోచించేది.
ప్రస్తుతం కీర్తి.. కరోనా వ్యాక్సిన్ నిల్వకు సంబంధించిన కంపెనీని నిర్వహిస్తున్నారు. స్టాట్విగ్ అనే వ్యాక్సిన్ ట్రాకింగ్ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఫార్మా కంపెనీల్లో తయారైన వ్యాక్సిన్ గమ్యస్థానాలకు చేరేవరకూ.. ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా వ్యాక్సిన్ ట్రాకింగ్ విభాగాన్ని డెవలప్ చేసి సక్సెస్ అయింది. దానికి గానూ ఫోర్బ్స్ ఇండియా లిస్ట్ లో స్థానం సంపాదించింది. ఈ ఘనత సాధించినందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
