29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

నాన్న కాదు నరకాసురుడు..

చెప్పిన మాట వినకుంటే మందలిస్తారు.. కాదంటే కాస్త కోపంగా బెదిరించి ఓ దెబ్బ వేస్తారు. కానీ చదవమంటే టీవీ చూస్తున్నాడని కన్న కొడుకును హత్య చేసేందుకు ప్రయత్నించిన  ఓ నరకాసురుడు లాంటి తండ్రి ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది.

స్థానిక ప్రభుత్వ స్కూళ్లో చరణ్ ఆరో క్లాసు చదువుతున్నాడు. గత రాత్రి తన తండ్రి బాలు ఇంటికొచ్చే సమయానికి చరణ్ టీవీ చూస్తున్నాడు. చదవడం లేదని.. ఆవేశంతో ఊగిపోయిన బాలు చరణ్ పై టర్పెంటాయిల్ పోసి మంట పెట్టాడు. తీవ్ర గాయాలపాలైన చరణ్ ని స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బాలుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. పిల్లాడ్ని చంపేందుకు ప్రయత్నించిన బాలుపై స్టూడెంట్ సంఘాలు, మేధావులు మండిపడుతున్నారు.

- Advertisement -

Latest news

Related news