21.7 C
Hyderabad
Friday, January 22, 2021

వీళ్లకే తొలి వ్యాక్సిన్

కరోనా సమయంలోనూ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సేవలందించిన.. దవాఖానల్లో పనిచేసే సఫాయి కార్మికులకు తెలంగాణ ప్రభత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. జనవరి 16న ప్రారంభమయ్యే కరోనా వ్యాక్సినేషన్ లో తొలి వ్యాక్సిన్ ను వారికే వేయాలని నిర్ణయించింది. వీరి తర్వాతే పారా మెడికల్, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల ద్వారా కరోనా వారియర్లకు వ్యాక్సిన్లు చేయనున్నారు. గాంధీ దవాఖానలో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్‌ వ్యాక్సినేషన్ ను ప్రారంభిస్తారు. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు 3.30 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.  వ్యాక్సిన్ చేయించుకున్నాక ఆరోగ్య సమస్యలు వస్తే తక్షణమే చికిత్స అందించేందుకు 57 దవాఖానల్లో ఐసీయూ బెడ్లను సిద్ధంగా ఉంచారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 3.6 లక్షల డోసుల కొవిషీల్డ్‌, 20వేల కొవాగ్జిన్‌ డోసులు వచ్చాయి.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...