29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు

రాష్ట్రంలోని సినిమా థియేటర్లు ఇక ప్రేక్షకులతో కళకళలాడనున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు న‌డుపుకోవ‌చ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేట‌ర్లు తెరచుకోవచ్చని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

సినిమా థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్ ల‌లో 100 శాతం సీట్లను నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చింది. అయితే భౌతిక దూరం, మాస్కులు, శానిటైజ‌ర్లు, టెంప‌రేచ‌ర్ చెకింగ్‌లు, షో టైమింగ్స్‌, బుకింగ్స్ టైమింగ్ లలో మార్పులు చేయాల‌ని తాజా మార్గద‌ర్శకాల్లో సూచించారు. గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే థియేటర్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చినా.. కేవ‌లం 50 శాతం కెపాసిటీతోనే న‌డ‌ప‌డానికి మాత్రమే అనుమ‌తి ఉండేది.

- Advertisement -

Latest news

Related news