29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. కానీ..

ఔను వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకోని కలిసి ఉండాలని అనుకున్నారు. కానీ వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దాంతో వారిద్దరు కలిసి పురుగుల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.

ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం నట్లగుంట గ్రామానికి చెందిన 21ఏళ్ల యువకుడు.. భూపాలపల్లికి చెందిన 17ఏళ్ల యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకోని నూరేళ్లు కలిసి ఉండాలనుకున్నారు. అమ్మాయి కుటుంబసభ్యులు వీరి పెండ్లికి ఒప్పుకోలేదు. నిన్న నల్లగుంటలోని బంధువుల ఇంటికి వచ్చిన యువతిని తీసుకోని గ్రామ శివారులోని దేవాదుల పైప్ లైన్ వద్దకి యువకుడు వెళ్లాడు. ముందే అనుకున్న ప్రకారం వెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగి ఆ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరిని ములుగు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి అనంతరం మల్లంపల్లిలోని ప్రైవేటు క్లినిక్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Latest news

Related news