72వ గణతంత్ర దినోత్సం వేళ హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక భవనాలు త్రివర్ణ లైటింగ్ తో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. వీటి వెలుగులను ఒకే ఫ్రెమ్ లో బంధించేందుకు డ్రోన్ కెమెరాలతో అద్భుతంగా వీడియోను తీశారు. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ పేరుతో ఈ వీడియోను మంత్రి కేటీఆర్ ఇన్ స్టాలో షేర్ చేశారు. 4 గంటల్లో 75 వేలకు పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు.
దుర్గంచెరువు తీగల వంతెన, చార్మినార్, అసెంబ్లీ భవనం, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు భవనం, నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ టైమ్ స్వ్కైర్, తాత్కాలిక సచివాలయం ఉన్న బీఆర్కే భవన్, మొజాంజాహీ మార్కెట్ భవనాలు రాత్రి వేళ త్రివర్ణ లైటింగ్ తో వెలిగిపోయాయి.