32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

బీజేపీ నేతలారా ఖబడ్దార్

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్‌లో ఏదో ఒక అలజడి సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ కండువలు, జెండాలు వేసుకొని వచ్చి దాడులు చేయటమేంటి? మేం ఒక్క పిలుపిస్తే మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతారని హెచ్చరించారు. మీరు రాష్ట్ర నాయకత్వాన్ని అదుపుచేస్తారా ? లేక మేము మా తడాఖా చూపించాలా.. అని బీజేపీ కేంద్రనాయకత్వాన్ని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ధర్మారెడ్డి రామాలయం డబ్బుల లెక్కలడిగితే తప్పా? మేం ఈ విషయాన్ని తేలిగ్గా వదలమని,  మీరు దాడులకు తెగపడితే మా శ్రేణులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

ప్రభుత్వంలో ఉండటం వల్ల తగ్గి ఉండాల్సి వస్తోంది.. లేదంటే..

బీజేపీ వాళ్లు దాడులు చేసి విధ్వంసం సృష్టించటం మంచిపద్దతి కాదు, జాతీయ పార్టీగా ఉండి వీధి రౌడీలుగా ప్రవర్తించడం సిగ్గుచేటని మాజీ డిప్యూటీ సీఎం, ఎంఎల్సీ కడియం శ్రీహరి అన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని, మా నేతలు ఎంతోమంది విరాళాలిస్తున్నారని గుర్తుచేశారు. రామాలయం నిర్మాణం కోసం వీహెచ్పీ మాత్రమే విరాళాలు సేకరిస్తుందని, పార్టీల కతీతంగా నిర్మాణం జరుగుతుందని వీహెచ్పీ ప్రతినిధులు ప్రకటించారు. 100-150 మందిని వెంటేసుకువచ్చిన నేతలు దాడికి ఉసికొల్పారన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ధర్మారెడ్డి ఇంటిపై దాడి జరిగిందని కడియం అభిప్రాయపడ్డారు. బీజేపీ నేతలు కయ్యానికి కాలు దువ్వి కేసులు పెట్టించుకుని లబ్ధిపొందాలని గేమ్ ప్లే చేస్తున్నారని కడియం చెప్పారు. ప్రభుత్వంలో ఉండటం వల్ల మేం తగ్గి ఉండాల్సి వస్తోందని లేదంటే మా తడాఖా చూపించేవాళ్లమన్నారు.

- Advertisement -

Latest news

Related news