తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర, యాదవ కులస్తుల ఇలవేల్పు శ్రీ పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం రూ. 2 కోట్లు కేటాయించడం హర్షణీయమని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ జానయ్యయాదవ్, పెద్దగట్టు జాతర మాజీ చైర్మన్ కడారి సతీష్ యాదవ్‌లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి చిత్రపటాలకు యాదవ కులస్తులు పాలాభిషేకం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో జాతరకు అంతంతమాత్రంగా నిధులు కేటాయించడంతో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరగక భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవుల మనసెరిగిన ప్రభుత్వమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో విజయవంతం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి జగదీశ్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జటంగి నాగరాజు, వల్లపు నరేష్, గడ్డం నారాయణ, జాతంగి లింగరాజు, బొడ్డు కిరణ్ తదితరులు ఉన్నారు.