23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

మద్యం మత్తులో ఆ బుల్లితెర నటుడు ఏం చేశాడో తెలుసా?

తాగిన మత్తులో సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్ వీరంగం సృష్టించాడు. తాగిన మత్తులో ఇద్దరు మహిళలతో గొడవకు దిగాడు. రాత్రి 9 గంటలకు వారి ఇంటికెళ్లి మద్యంమత్తులో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అసభ్య పదజాలంతో మహిళలను సమీర్ దూషించాడు. అప్పు చెల్లించమన్నందుకు.. ఇంటి మీదకొచ్చి రెచ్చిపోయాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన సమయంలో సమీర్‌తో పాటు మరో నలుగురు యువకులు మహిళల మీద దాడికి పాల్పడ్డారు. మణికొండలో నివాసముండే తమ మీద దాడికి దిగిన బుల్లితెర నటుడు సమీర్ మీద బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఐదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని.. డబ్బులివ్వమని అడిగితే రౌడీయిజం చేస్తున్నాడంటూ బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమీర్‌ నుంచి తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని బాధిత మహిళలు పోలీసుల ముందు వాపోయారు. కాగా.. సమీర్ మాత్రం వారి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని వాదిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

- Advertisement -

Latest news

Related news