వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి చెందగా.. 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నవాబ్‌పేట మడలంలోని పలు గ్రామాల్లో చోటు చేసుకుంది. చిట్టిగిద్ద గ్రామంలో, పెండ్లిమడుగు గ్రామంలో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు. ఎర్రవల్లి, వట్టిమినపల్లి, ఏమామిడి, ఆర్కతల గ్రామాల్లో కల్తీ కల్లు తాగి ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలసుకున్న చేవెళ్ల, వికారాబాద్ ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మెతుకు ఆనంద్ బాధిత గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కల్తీ కల్లు బాధిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అప్రమత్తమైన అబ్కారీ శాఖాధికారులు ఆయా గ్రామాల్లోని కల్లు దుకాణాలను సీజ్ చేసి, కల్లును పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు.