29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

భయం లేకుండా వ్యాక్సిన్లు తీసుకోండి.. కేటీఆర్

కరోనా వ్యాక్సన్లు సేఫ్ అని ప్రపంచ సంస్థలు ప్రకటించాయని అందువల్ల ప్రజలు భయం లేకుండా వ్యాక్సిన్లు తీసుకోవాలని మినిస్టర్ కేటీఆర్ స్పష్టం చేశారు. తిలక్ నగర్ యూపీహెచ్ సీలో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ తో కలిసి కరోనా వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్న  వ్యాక్సిన్లు అన్ని అనుమతులు పొందాయన్నారు. కాబట్టి వీటిపై ఎలాంటి ఆందోళనలు, అపోహలు, భయం లేకుండా ప్రజలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. కరోనా మహమ్మారిపై అంతిమ పోరాటం మొదలైందని, దేశంలో 130 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందాలంటే సమయం పడుతోందన్నారు.

రాష్ట్రంలో 140 కేంద్రాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంద‌న్నారు.  కొవాగ్జిన్ టీకా హైద‌రాబాద్‌లో త‌యారు కావ‌డం గ‌ర్వకార‌ణంగా ఉంద‌న్నారు. సుర‌క్షిత‌మైన వ్యాక్సిన్ల‌ను హైద‌రాబాద్ న‌గ‌రం ప్రపంచానికి అందిస్తుంద‌ని చెప్పారు.  టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి టీకా రాజ‌ధానిగా హైద‌రాబాద్  మారింద‌న్నారు. ప్రాధాన్యత క్రమంలో అంద‌రికీ వ్యాక్సిన్లు వేస్తార‌ని కేటీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Latest news

Related news