29.6 C
Hyderabad
Wednesday, January 27, 2021

యాదాద్రిలో నేత్రపర్వంగా వైకుంఠ ఏకాదశి.. ఉత్తర ద్వారం నుంచి స్వామి దర్శనం

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. వేకువ జాము నుంచే మొదలైన ఉత్సవాల్లో స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారు జాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈరోజు నుంచి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆరు రోజుల పాటు వైభవోపేతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రోజుకో అవతారంలో స్వామి వారు భక్తులను కటాక్షించనున్నారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కనుల పండువలా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చిన స్వామి వారిని భక్తులు దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

Latest news

Related news

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది....

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...

గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను...

రూ.4500 కోట్లు ఆర్జించిన ఓటీటీలు

దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు గతేడాది రూ.4500 కోట్లు ఆర్జించాయని ఈవై ఫిక్కి ఇండియన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఓటీటీల వ్యాపార విలువ...