28.2 C
Hyderabad
Sunday, January 17, 2021

మహానగరంలో పంప్ హౌజ్ మరమ్మత్తులు 16, 17న వాటర్ సప్లై బంద్

మహానగరానికి తాగునీటి సరఫరాలో కీలకమైన కృష్ణా ఫేజ్‌ -1 పంప్‌హౌజ్‌ మరమ్మత్తులు చేజనున్న దృష్ట్యా  ఈ నెల 16, 17న నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్టు జలమండలి ఎండీ ఎం.దానకిషోర్ ప్రకటించారు.

మరమ్మత్తులు పూర్తయ్యే వరకు దాదాపు 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తారు. కోదండాపూర్‌, నాసర్లపల్లి, గొడకండ్ల పంప్‌హౌజ్‌లో 600 ఎంఎం పైపులైన్‌పై వాల్వులు అమర్చడం, 300 ఎంఎం డయా పైపులైన్‌ లీకేజీలను అరికట్టేందుకు ఈ మరమ్మతులు చేపడుతున్నట్టు దానకిషోర్ తెలిపారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని గమనించి నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఎండీ కోరారు.

నీటి సరఫరా ఉండని ప్రాంతాలివే..

మీరాలం, కిషన్‌బాగ్‌, బాల్‌షెట్టికేత్‌,  అల్జుబేర్‌కాలనీ, అలియాబాద్‌, హషమాబాద్‌, రియాసత్‌నగర్‌, సంతోష్‌నగర్‌, వినయ్‌నగర్‌, సైదాబాద్‌, ఆస్మాన్‌ఘడ్‌, దిల్‌షుక్‌నగర్‌, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మెహబూబ్‌ మాన్షన్‌, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్‌, హిందీనగర్‌, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివంరోడ్‌, చిలకలగూడ ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఈ నెల 16,17 తేదీలలో నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మత్తుల అనంతరం నీటి సప్లైని పునరుద్ధరిస్తారు.

- Advertisement -

Latest news

Related news

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...