22.6 C
Hyderabad
Sunday, January 17, 2021

తాగుబోతు భర్తకు బడితె పూజ చేసిన భార్య

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇమాంపూర్‌ గ్రామానికి చెందిన యాదగిరి మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం తాగి ఇంటికి వచ్చి పిల్లలను, భార్యను వేధిస్తున్నాడు. మద్యం మత్తులో పిల్లల్ని, భార్యను కొడుతూ.. తిడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి ఓపిక పట్టిన భార్య కనకవ్వ గతంలో రెండుమూడు సార్లు పంచాయతీ పెట్టి పెద్దలకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చినా యాదగిరి తీరులో మార్పు రాలేదు.

తాజాగా మళ్లీ మద్యం సేవించి ఇంట్లో అందరినీ కొడుతూ బూతులు తిడుతూ వేధించాడు. విసుగు చెందిన కనకవ్వ భర్తను గ్రామంలోని పంచాయతీ కార్యాలయం దగ్గరికి తీసుకుచ్చింది. అక్కడ ఉన్న జెండా కర్రకు కట్టేసి బడితె పూజ చేసింది. గ్రామస్థులు, పెద్దలు సర్ది చెప్పి యాదగిరి కట్లు ఊడదీశారు. దెబ్బలకు తాళలేక యాదగిరి బ్రతుకు జీవుడా పరుగులు పెట్టాడు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...