మరో మహిళతో సంబంధం పెట్టుకొని తనను వదిలించుకోవాలని చూసిన భర్తకు ఓ మహిళ తగిన గుణపాఠం చెప్పింది. అతను పని చేస్తున్న బ్యాంకుకు వెళ్లి అందరూ చూస్తుండగానే నిలదీసింది. డొంక తిరుగుడు సమాధానాలు చెప్పిన భర్తకు దేహశుద్ధి చేసింది. వరంగల్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పోచమ్మ మైదాన్ లోని ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. పది సంవత్సరాల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి పాప కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస్.. ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. ఈ ఆలోచనతోనే.. వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు.
ఈ విషయం తెలిసిన అతని భార్య శ్రీనివాస్‌ను నిలదీసింది. అయినా అతనిలో మార్పు రాలేదు. విసిగిపోయిన ఆమె.. నేరుగా అతడు పని చేస్తున్న బ్యాంకుకే వెళ్లింది. శ్రీనివాస్‌ను అందరి ముందే నిలదీసింది. తనను వదిలించుకోవాలని చూస్తున్న భర్తను అందరూ చూస్తుండగానే ఉతికి ఆరేసింది. గల్లా పట్టి మరీ కొట్టింది. శ్రీనివాస్‌పై అతని భార్య దాడి చేస్తుండగా బ్యాంకు సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అమె వెనక్కి తగ్గలేదు. బాధిత మహిళ భర్త శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.