26.6 C
Hyderabad
Sunday, January 24, 2021

చెట్టులెక్కగలదు.. కల్లు తీయగలదు

మగోళ్లు మాత్రమే చేసే కల్లుగీత పని ఆడ మనిషి చేయాలంటే రిస్కే. కానీ.. ఆమె మాత్రం దాన్ని రిస్క్ అనుకోలేదు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. కస్సున దిగే బాణాల్లాంటి ముండ్లు చూసి బెదరలేదు. ధైర్యంగా ఈతచెట్టెక్కి కల్లు గీస్తున్నది. ఇంటి బాధ్యతలు భుజాన వేసుకొని కల్లు గీసి.. అమ్మి ఇల్లు నడుపుతున్నది. ఒక మహిళ కల్లు గీయడమా అని మొదట్లో అందరూ ముక్కు మీద వేలేసుకున్నరు.

ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా పుర్ర సావిత్రి. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం రేగోడ్ గ్రామం ఆమె ఊరు. భర్త చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పోషించడం సావిత్రికి భారంగా మారింది. ఇద్దరు పిల్లలతో పాటు మామ భాద్యత కూడా ఆమె పైనేపడింది. అప్పటి వరకు భర్త చేసిన కల్లు గీత పనినే చేయాలని నిర్ణయించుకుంది. పిల్లల కడుపు నింపేందుకు కల్లు గీయడం మొదలుపెట్టింది. మొదట్లో చిన్న చిన్న ఈతచెట్లకు కల్లు గీయడం మొదలు పెట్టి.. క్రమంగా ఇప్పుడు పెద్ద చెట్లు కూడా ఎక్కుతోంది.

సావిత్రి పొద్దున్నే 5 గంట‌ల‌కు లేచి 8 కిలోమీట‌ర్లు న‌డిచి.. కల్లు గీసి 50 లీటర్ల కల్లు సేకరిస్తుంది. కల్లు ఊళ్లోకి తీసుకొచ్చి అమ్మి.. రోజుకు రూ400 వరకు సంపాదిస్తుంది. ఉన్న కష్టాలు చాలవన్నట్టు సావిత్రికి బిడ్డకు పక్షవాతం వచ్చింది. మామకు అనారోగ్యం. వారిద్దరి వైద్య ఖర్చులు అదనపు భారంగా మారాయి. అయినా.. ఏమాత్రం వెనుకాడడం లేదు. వారిద్దరి వైద్య ఖర్చులకు నెలకు రూ.6 వేల వరకు ఖర్చు చేస్తుంది.

పొద్దున్నే ఇంటి పనులు చేసుకొని.. కల్లు గీయడానికి వెళ్తుంది. ఇటు ఇంటి పని.. అటు కల్లుగీత పని రెండూ చేసి అలసిపోతుంది. అయినా తన పని మాత్రం ఆపడం లేదు. భర్త చేసిన కల్లుగీత పని తాను కొనసాగిస్తున్నందుకు బంధువులు కొంతమంది ఆమెతో మాట్లాడడం మానేశారు. ఈ మధ్యే సావిత్రికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ లైసెన్స్ కూడా మంజూరు చేసింది. ఈ లైసెన్స్ వల్ల రోజుకు 30 చెట్ల నుంచి కల్లు తీసుకునేందుకు అనుమతి వచ్చిందని సావిత్రి చెప్పింది. జీవితంలో కష్టాలొచ్చినయి ఆగిపోకుండా.. కుంగిపోకుండా అడుగు ముందుకేసి తట్టుకొని నిలబడి ఆదర్శంగా నిలిచింది. వెక్కిరించిన వారి చేతే శెభాష్ అనిపించుకుంటున్నది.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...