29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి.. మంత్రి వేముల

సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, అకుంఠిత దీక్షతో ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్నినిర్మించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన ఆలయం మరెక్కడా లేదన్నారు. రానున్న రోజుల్లో ఆధ్యాత్మిక శోభతో, భక్తులతో యాదాద్రి అంతా ఫరిడవిల్లుతుందని మంత్రి ఆనందం వెలిబుచ్చారు. యాదాద్రి పనుల పురోగతిని అధికారులతో కలిసి మంత్రి వేముల పరిశీలించి పలు సూచనలు చేశారు. ఫినిషింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి , ఆర్ అండ్ బి శాఖ ఈఎన్సీలు గణపతి రెడ్డి , రవీందర్ రావు, యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news