18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

ఆ గొంతు మా నాన్నది కాదు : నోముల కొడుకు భగత్

దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య చివరి సందేశం అంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న.. ఆడియోపై ఆయన కుమారుడు నోముల భగత్, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది  కావాలనే తన తండ్రి నోముల నర్సింహయ్య మీద అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. తప్పుడు వాయిస్ క్లిప్పులు సృష్టించి వ్యాప్తి చేస్తున్నారు.

సీఎం కేసీఆర్  వెంట నడుస్తూ  అభివృద్ధి కోసమే తన తండ్రి సీపీఎం జెండాను పక్కనబెట్టి గులాబీ జెండాను భుజానికెత్తుకున్నారని నోముల భగత్ అన్నారు. అనుక్షణం ప్రజల కోసమే బ్రతిన ప్రజల నాయకుడు నరసింహయ్యపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారాలతో ఆయన ఆత్మను క్షోభ పెట్టొద్దని కోరారు. సీపీఎం పార్టీ వీడి.. తెరాసలో చేరినప్పుడు ఆయన మీడియా ముఖంగా చివరి వరకు తెరాసలోనే ఉంటానని.. కేసీఆర్ బాటలో నడుస్తానని చెప్పిన మాట మీద చివరి వరకు నిలబడ్డారని భగత్ అన్నారు.  తప్పుడు ఆడియోలు సృష్టించిన వ్యకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Latest news

Related news

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...