18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం రాక ముందు 13వ స్థానంలో ఉండేది. రాష్ట్రం వచ్చినంక తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉన్నం. ఉత్తర ప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి బీజేపీకి ఓటెయ్యమని చెప్పడానికి వచ్చిన ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ముందు ఆ రాష్ట్ర తలసరి ఆదాయం పెంచుకునేందుకు దృష్టి పెట్టాలని సూచించారు. 28వ స్థానంలో ఉన్న యోగి, మహారాష్ట్ర తలసరి ఆదాయంలో 10వ స్థానంలో ఉండి.. 5వ స్థానంలో ఉన్న తెలంగాణకు చెప్పడానికి వచ్చారని.. సీఎం కేసీఆర్ ఎద్దెవా చేశారు.

మనకు చెప్పే మొఖాలా వాళ్లవి : సీఎం కేసీఆర్

తెరాసకు ఓటేసి.. మన హైదరాబాద్‌ను ప్రశాంత నగరంగా ఉండేలా కొనసాగిద్దామా.. లేక అల్లర్లు, కర్ఫ్యూలతో కల్లోల నగరంగా మార్చుకుందామా? అని కేసీఆర్‌ ప్రజలను ప్రశ్నించారు. హైదరాబాద్‌కు పరిశ్రమలు, కంపెనీలు, బిల్డర్లు వస్తున్నరు. మన బిడ్డలకు ఉపాధి దొరుకుతదని.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లెవరూ.. మన నగరాన్ని అభివృద్ది చేయరని.. ఓట్లు అయిపోగానే వెళ్లిపోతారని.. వాళ్ల మాటలు నమ్మి.. హైదరాబాద్‌ను ఆగం చేసుకోవద్దని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంతోమంది హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నారని.. కరోనా సమయంలో వారిని రాష్ట్ర ప్రభుత్వం స్వంత ఖర్చుతో వారి స్వస్థలాలకు పంపించిందని.. అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రో, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రో రాలేదని సీఎం ప్రజలకు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

వాట్సాప్ వెబ్ వాడితే అంతే..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్...

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...