రైతుల ఉద్యమంలో పలు సంఘ విద్రోహ శక్తులు చొరబడేందుకు కుట్ర పన్నుతున్నయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఆరోపించిండు. అలాంటి వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేసిండు. అభ్యంతరాల పరిష్కారానికి రైతులతో తదుపరి చర్చలకు సిద్ధంగా ఉన్నమన్నడు. మరోవైపు అన్నదాతల సహనాన్ని పరీక్షించొద్దని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చిండు. రైతుల డిమాండ్లపై కేంద్రం సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే, దేశవ్యాప్తంగ ఉద్యమం విస్తరిస్తుందని హెచ్చరించిండు.