29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

తియ్యటి తేనెతో ఎన్ని లాభాలో..

ప్రకృతి మనకందిచిన సూపర్ ఫుడ్స్ లో తేనె ఒకటి. పువ్వుల్లో ఉండే మకరందంతో తేనె తయారవుతుంది. తేనెటీగలో ఉండే ఎంజైములు తేనెలో కలవడం వల్ల తేనే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన తేనెను రోజూ తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయంటే..
తేనెతో సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చు. అంటే రోగనిరొధక శక్తి నుంచి సౌందర్యం వరకూ అన్నిరకాల గుణాలు తేనెలో ఉన్నాయి.
తేనెను రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో పాటు, పలురకాల గుండె జబ్బుల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.
తేనెలోని ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారిస్తాయి. అంతేకాదు, అల్సర్, గ్యాస్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.
మగవాళ్లలో వీర్య కణాల వృద్ధికి కూడా తేనె ఉపయోగపడుతుంది. రోజూ తేనే తీసుకోవడం వల్ల వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.
రోజంతా యాక్టివ్ గా ఉండేవాళ్లు, స్పోర్ట్స్ ఆడేవాళ్లు, అథ్లెట్స్.. ఇలాంటి వాళ్లంతా తేనెను కచ్చితంగా తీసుకోవాలి. తేనె శారీరక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
తేనె దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను మెడిసిన్ లా పనిచేస్తుంది. అలాగే తేనె రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ క్రమబద్దీకరిస్తుంది.
అంతేకాదు శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండడానికి, కంటి చూపు మెరుగుపడడానికి, బరువు తగ్గడానికి, యూరినల్ ఇన్ఫెక్షన్ లకు ఇలా చాలావాటికి తేనె సహజమైన ఔషదంగా పనిచేస్తుంది.
రాత్రిళ్లు తరచూ మూత్రంతో ఇబ్బంది పడేవాళ్లు.. నిద్రపోయే ముందు ఒక స్పూన్ తేనె తాగితే మాటిమాటికి మూత్రానికి వెళ్లవలసిన అవసరం ఉండదు.
నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లు రాత్రి పడుకోబోయే ముందు పాలలో తేనె కలుపుకుని తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.
ఇలా కూడా..
ఇకపోతే తేనెను కొన్నిరకాలుగా తీసుకోవడం వల్ల మరిన్ని ఎక్స్ ట్రా బెనిఫిట్స్ పొందొచ్చు.
తేనేను నిమ్మరసంతో కలిపి తీసుకుంటే.. గొంతు నొప్పి, జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గుతాయి.
తేనెను, అల్లం రసంతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా అజీర్ణ సమస్యలు దూరమవుతాయి.
తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరీయా, యాంటి సెప్టిక్ గుణాలు.. చర్మంపై గాయాలను మానేలా చేస్తాయి.
కీళ్లనొప్పులు ఉన్నవాళ్లు తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమాన్ని కీళ్లపై మర్దన చేస్తే తగ్గుతాయి కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
తాజా ఆకుకూరలతో తేనెను కలిపి తీసుకుంటుంటే రక్తకణాలు వృద్ధిచెందుతాయి.

- Advertisement -

Latest news

Related news