29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

చాక్లెట్ గురించి ఈ విషయాలు తెలుసా?

వాలెంటైన్ వీక్‌లో ఈ రోజు చాక్లెట్ డే. ఈ రోజు ఒక మంచి చాక్లెట్‌తో ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయెచ్చు. ప్రేమికులు తియ్యని వేడుక చేసుకునే రోజు ఇది.
పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాక్లెట్‌ను ఇష్టపడని వాళ్లుండరు. శుభకార్యం చేసే ముందు నోరు తీపి చేసుకోవడం అలవాటు చాలామందికి. అయితే ఒకప్పుడు తీపి కోసం స్వీట్స్ వాడేవాళ్లు. ఇప్పుడు ఫ్యాషన్‌గా ఉంటుందని చాక్లెట్స్ వాడుతున్నారు. అంతే తేడా. పైగా ప్రేమికులకు చాక్లెట్స్‌కు చాలా దగ్గర సంబంధం ఉంది. చాక్లెట్స్‌ను ఇష్టపడని అమ్మాయుండదు. ఎంత కోపంగా ఉన్నా.. అలిగినా.. చేతిలో ఒక చాక్లెట్ పెడితే చాలు వారి ముఖంలో చిరున‌వ్వును చూడొచ్చు. అందుకే వాలంటైన్ వీక్‌లో చాక్లెట్ డే ప్రత్యేకమైన స్థానం. అలాగే చాక్లెట్ ఇవ్వడం వలన ఇద్దరి మధ్యన బంధం బలపడుతుందని కొన్ని దేశాలు బలంగా నమ్ముతుంటాయి
చాక్లెట్ మంచిదేనా?
రోజూ ఓ చిన్న చాక్లెట్ తినడం వల్ల ఎలాంటి హాని ఉండదని స్టడీలు చెప్తున్నాయి. పైగా చాక్లెట్‌తో కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాక్లెట్లు తయారు చేసే కొకోవాలో ప్రొటీన్లు, క్యాల్షియం, కాపర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, బి1, బి2, డి, ఇ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. చాక్లెట్లలో ఉండే ఓలియాన్ ఆమ్లం గుండె జబ్బుల్ని రానివ్వదు. మెదడులో సెరిటోనిన్, డోపమైన్ వంటి రసాయనాల విడుదల చేయడం వల్ల చాక్లెట్ తినగానే మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది.
ఇవి తెలుసా..
నిప్‌షిల్ట్ ఫ్రిట్జ్ కంపెనీ 1999లో రూపొందించిన చాకోపొలాజి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌గా గుర్తింపు పొందింది. అత్యుత్తమ ట్రఫెల్, కొకోవా బీన్స్‌తో దీన్ని తయారు చేస్తారు. ఈ చాక్లెట్ ధర అరకిలో సుమారు రూ. 2 లక్షలు ఉంటుంది. ఆ తర్వాత ఖరీదైన చాక్లెట్‌గా నోకా వింటేజ్ కలెక్షన్‌ ఉంది. దీని ధర సుమారు రూ. 56,000. దీనికోసం ట్రినిడాడ్, ఈక్వెడార్, వెనెజులా, కోట్ డీవార్ నుంచి కొకోవా గింజల్ని సేకరిస్తారు.
చాక్లెట్ 93 డిగ్రీల ఫారిన్ హీట్ దగ్గర కరుగుతుంది. ఇది మానవ శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువ. అందుకే నాలుకపై చాక్లెట్ అంత తేలికగా కరుగుతుంది.
కొకోవా చెట్లు 200 సంవత్సరాల వరకూ జీవించగలవు.

- Advertisement -

Latest news

Related news