22.9 C
Hyderabad
Sunday, January 17, 2021

కుక్కలు, పందులకు కూడా లైసెన్స్ ఉండాల్సిందే : ఏపీ సర్కార్ కొత్త రూల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఏపీలో పెంచుకునే కుక్కలు, పందులకు సైతం లైసెన్స్ ఉండాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీచేసింది. పెంపుడు జంతువులకు టోకెన్లు జారీచేయాలని తెలిపింది. ఈ టోకెన్లు జంతువుల మెడలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లైసెన్స్‌ లేని కుక్కలు, పందులు తదితర పెంపుడు జంతువులను గుర్తించి.. వాటి యజమానులకు రూ.500 వరకు అపరాధ రుసుము విధించనున్నారు. అవి అధికారుల ఆధీనంలో ఉన్నన్ని రోజులురోజుకు రూ.250 చొప్పున పెనాల్టీ చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఒకవేళ పట్టుకున్న పెంపుడు జంతువులను తిరిగి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే వాటిని వీధి కుక్కలు, వీధి పందులుగా గుర్తించి కుటుంబ నియంత్రణ చేయనున్నట్ట ఆదేశాల్లో పేర్కొన్నారు. పెంపుడు జంతువుల లైసెన్స్ ముగిసిపోతే తిరిగి 10 రోజుల్లోగా లైసెన్సును పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. పెంపుడు జంతువుల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే యజమానులు వాటి హెల్త్ సర్టిఫికెట్లు కూడా అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గుర్తింపు పొందిన ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్‌ మాత్రమే సమర్పించాలని ఆదేశించింది.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...