29.3 C
Hyderabad
Monday, March 1, 2021

శవాల్లా తేలియాడుతూ ఫొటో షూట్.. వీడియో వైరల్..

పెళ్లి ఘనంగా జరిగినా జరగకపోయినా.. ప్రీ-వెడ్డింగ్ షూట్ మాత్రం అదిరిపోయేలా ఉండాలని అనుకోవడం మామూలే.. కానీ కొన్నిచోట్ల ఈ షూట్ లు మరీ విడ్డూరంగా తయారయ్యాయి. ఇప్పటివరకూ ఎవరూ ట్రై చేయని కొత్తకొత్త కాన్సెప్ట్స్ లో ఫొటోలు ఉండాలని వధూవరులు అడగడం.. ఫొటోగ్రాఫర్లు కూడా దానికి తగ్గట్టుగా వింతవింత పోకడలతో షూట్స్ చేయడం.. ఇదీ ఇప్పుడు నడుస్తున్న ప్రీవెడ్డింగ్స్ తంతు.
ఇటీవల జరిగిన ఓ ప్రీవెడ్డింగ్ షూట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ ఫొటో షూట్ లో క్రియేటివిటీ పీక్స్ కి వెళ్లింది. ఎంతలా అంటే.. శుభమా అని పెళ్లి జరుగుతుంటే.. వీళ్లకు ఇదేం పోయేకాలం అని అందరూ తిట్టేంతలా..
వివరాల్లోకి వెళ్తే.. ఓ నదీ తీరంలో నల్ల దుస్తుల్లో ఓ జంట నీటిపై తెలుతూ కనిపించింది. వారిని చూస్తే.. ఒకరినొకరు తాడుతో కట్టేసుకుని.. ఒకేసారి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని.. ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. కట్.. చేస్తే.. ఇదంతా ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్.. లవర్స్ సూసైడ్ చేసుకున్న థీమ్‌లో ఈ ఫొటోషూట్ ను డిజైన్ చేశారు ఫొటోగ్రాఫర్లు. ఈ ఫొటోషూట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

- Advertisement -

Latest news

Related news